Election Commission: టీడీపీ, జనసేన, బీజేపీలపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ పోలీసులు

  • పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు
  • నిందలు వేస్తూ నైతిక, మానసిక స్థైర్యాన్ని దెబ్బతిస్తున్నారని ఆవేదన
  • తగిన చర్యలు తీసుకోవాలని కోరిన పోలీసు అధికారులు
AP Police has complained to EC against TDP and Janasena and BJP

ఎన్నికల వేళ విపక్ష పార్టీలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ పోలీసులు ఆశ్రయించారు. టీడీపీ, జనసేన, బీజేపీలపై ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తూ తమ నైతిక, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పలువురు అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు 19 మంది ఐపీఎస్‌లు కలిసి రాసిన లేఖను సీఈవో మీనా కుమార్‌కు అందజేశారు. విజయవాడ కమిషనర్‌ కాంతిరాణా ఫిర్యాదు అందించారు.

టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలను చూపిస్తున్నారని ఏపీ పోలీసులు ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. పదే పదే తప్పుడు కథనాలు, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News