Virat Kohli: ఐపీఎల్ లో కోహ్లీ 8వ సెంచరీ... బెంగళూరు భారీ స్కోరు

Kohli 8th century leads RCB reasonable score
  • ఐపీఎల్ లో నేడు ఆర్సీబీ × రాజస్థాన్ రాయల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసిన బెంగళూరు
  • 72 బంతుల్లో 113 పరుగులు చేసిన కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ బ్యాట్ కు ఇవాళ ఎదురులేకుండా పోయింది. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో కోహ్లీ తిరుగులేని సెంచరీ నమోదు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ కోహ్లీ సెంచరీ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. 

కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సలు ఉన్నాయి. కోహ్లీకి ఐపీఎల్ కెరీర్ లో ఇది 8వ సెంచరీ. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు, ఐపీఎల్ తాజా సీజన్ లో కోహ్లీదే తొలి సెంచరీ.

ఇక, బెంగళూరు ఇన్నింగ్స్ చూస్తే... కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనింగ్ పార్టనర్ షిప్ అదుర్స్ అనిపించేలా సాగింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 125 పరుగులు జోడించారు. డుప్లెసిస్ 44 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) వెంటనే వెనుదిరిగారు. 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ కు 2, నాండ్రే బర్గర్ కు 1 వికెట్ లభించాయి. 

ఐపీఎల్ లో అత్యధిక సెంచరీల జాబితా
విరాట్ కోహ్లీ- 8
క్రిస్ గేల్- 6
జోస్ బట్లర్- 5
కేఎల్ రాహుల్- 4
డేవిడ్ వార్నర్- 4
షేన్ వాట్సన్- 4
Virat Kohli
RCB
RR
Jaipur
IPL 2024

More Telugu News