IPL 2024: ఆర్సీబీపై టాస్ గెలిచిన రాజస్థాన్... కోహ్లీ దూకుడు

Rajasthan Royals won the toss and chose bowling
  • జైపూర్ లో ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 4 ఓవర్లలో 42 పరుగులు చేసిన బెంగళూరు
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. సొంతగడ్డ జైపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులో టీమ్ లో కొత్త ఆటగాడు సౌరవ్ చౌహాన్ కు స్థానం కల్పించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు వేగవంతమైన ఆరంభం లభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ ధాటిగా ఆడుతుండడంతో బెంగళూరు జట్టు 4 ఓవర్లలోనే 42 పరుగులు చేసింది. కోహ్లీ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో డుప్లెసిస్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేశాడు.
IPL 2024
RCB
RR
Jaipur

More Telugu News