KTR: స‌ర‌దాగా కాసేపు చిన్నారుల‌తో ష‌టిల్ ఆడిన కేటీఆర్‌.. ఇదిగో వీడియో!

BRS Leader KTR Playing Shuttle with Children in Sircilla
  • శుక్ర‌వారం సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్
  • రోడ్డుపై చిన్నారుల‌తో క‌లిసి ష‌టిల్ ఆడి సంద‌డి
  • కేటీఆర్‌తో ఫొటోలు దిగి మురిసిపోయిన స్థానికులు
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిన్నారుల‌తో కాసేపు స‌ర‌దాగా ష‌టిల్ ఆడారు. రోడ్డుపై ష‌టిల్ ఆడుతున్న చిన్నారుల‌ను ప‌ల‌కరించిన బీఆర్ ఎస్ నేత నెట్ లేకుండా ష‌టిల్ ఎలా ఆడుతున్నారంటూ చిన్నారుల‌ను స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. అనంత‌రం వారితో కాసేపు ష‌టిల్ ఆడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో స్థానికులు ఫొటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. ఇలా చిన్నారుల‌తో కేటీఆర్ ష‌టిల్ ఆడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. రాజ‌కీయాల‌తో తీరిక లేకుండా గ‌డిపే కేటీఆర్ ఇలా కొద్ద‌సేపు చిన్నారుల‌తో ఆడి సంద‌డి చేశారు.
KTR
Sircilla
BRS
Telangana

More Telugu News