CM Ramesh: అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌పై కేసు

  • జిల్లాలోని గాంధీ గ్రామంలోగల ఓ టైల్స్ దుకాణంలో డీఆర్ఐ అధికారుల తనిఖీలు
  • తమను అడ్డుకున్నారంటూ సీఎం రమేశ్ సహా ఐదుగురిపై అధికారుల ఫిర్యాదు
  • డీఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు
Case filed against CM ramesh and five others over complaint of DRI assistant director

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారుల తనిఖీలకు అడ్డుపడ్డారన్న ఆరోపణలపై అనకాపల్లి లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్, చోడవరం అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజులపై పోలీసులు  కేసు నమోదు చేశారు. జిల్లాలోని చోడవరం మండలం గాంధీ గ్రామంలో గురువారం రాత్రి టైల్స్ దుకాణంలో అధికారుల తనిఖీల సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 

డీఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.ఎస్. కె. సోమేశ్ ఫిర్యాదు మేరకు సీఎం రమేశ్, కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి శిలపరశెట్టి బుచ్చిబాబు, ఆయన ఇద్దరు కుమార్తెలతో పాటు సోదరుడు రామకృష్ణ అలియాస్ శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తనిఖీలు చేస్తుండగా అధికారులను అడ్డుకోవడంతో పాటు వారి నుంచి రికార్డులను లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు.

More Telugu News