VV Lakshminarayana: విశాఖ ఉత్తర అసెంబ్లీ బరిలో వీవీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana to contest from Visakhapatnam assembly constituency

  • అన్ని స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నామని ప్రకటించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు
  • ఏపీలో 6 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • తెలంగాణలో 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ

ఏపీలోని అన్ని స్థానాల్లో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తొలి విడత జాబితాను ప్రకటించారు మొదటి విడతలో 6 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో 3 లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఉగాది నాటికి అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, హిందూపురంతో పాటు తెలంగాణలోని మెదక్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖ పశ్చిమ నుంచి వెంకట గణేష్, భీమిలి నుంచి ఎలిపిల్లి అనిల్ కుమార్ పోటీ చేయనున్నట్టు తెలిపారు.

VV Lakshminarayana
Visakhapatnam
Jai Bharat National Party
AP Assembly Polls
Lok Sabha Polls
  • Loading...

More Telugu News