Jagga Reddy: ఎమ్మెల్యేగా గెలిచిన వారికి గౌరవం ఇవ్వాలి... ఇక ఓట్ల కోసం రాజకీయాలు చేయను: జగ్గారెడ్డి

  • కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన జగ్గారెడ్డి
  • సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండవద్దని సూచన
  • కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుందని జోస్యం
Jagga Reddy interesting comments

ఎమ్మెల్యేగా గెలిచిన వారికి గౌరవం ఇవ్వాల్సిందేనని... తాను ఇక నుంచి ఓట్ల కోసం రాజకీయాలు చేయనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చేయించుకోవాలని సూచించారు. నిధులు తెచ్చేది తానే అయినప్పటికీ ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేకే ఉంటుందని తెలిపారు.

ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా ప్రోటోకాల్ పాటించాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేస్తే అడ్డుకుంటామని చెప్పడం సరికాదని... అలా చెప్పిన కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కార్యకర్తల పౌరుషం ఏమైంది? ఎందుకు నన్ను గెలిపించలేక పోయారు? అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా ఏ పార్టీ వారైనా గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నీలం మధుకి సంగారెడ్డి నియోజకవర్గంలో 20 వేల మెజార్టీ రావాలన్నారు. తానే వచ్చి తిరగాలని అనుకోవద్దని... నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

More Telugu News