Posani Krishna Murali: చంద్రబాబు ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కల్యాణ్ కు ఆయనే దేవుడు: పోసాని

  • వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని పోసాని ఆరోపణ
  • నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది చంద్రబాబేనని విమర్శ 
  • వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని విమర్శలు
  • పవన్ ను చంద్రబాబు లొంగదీసుకున్నారని వ్యాఖ్యలు
Posani comments on Chandrababu and Pawan Kalyan

ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ల అంశంపై ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబేనని అన్నారు. వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని, అందుకే ఇంటి వద్దనే పెన్షన్లు ఇవ్వకుండా అడుకున్నారని మండిపడ్డారు. 

"ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ భవిష్యత్ కోసం నాడు రంగాను పొట్టనబెట్టుకున్నారు, ఇప్పుడు రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ ను లొంగదీసుకున్నారు. పవన్ ను పక్కనబెట్టుకుని కాపులను లొంగదీయాలన్నది చంద్రబాబు ప్రణాళిక. చంద్రబాబు గతంలో కాపులను రౌడీలు అనలేదా? చంద్రబాబు ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కల్యాణ్ కు మాత్రం ఆయన దేవుడు" అంటూ పోసాని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ఏనాడైనా సొంతంగా ఒక పార్టీ పెట్టాడా? కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు... తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News