Pawan Kalyan: ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి పవన్ కల్యాణ్

Pawan Kalyan will continue election campaign from April 7
  • పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్
  • ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర జ్వరం
  • చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిన జనసేనాని
  • పవన్ కోలుకున్నారంటూ జనసేన పార్టీ ప్రకటన
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 7 నుంచి వారాహి విజయభేరి యాత్రను కొనసాగించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 

ఈ నెల 7న అనకాపల్లిలో, ఈ నెల 8న ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Pawan Kalyan
Election Campaign
Janasena
Pithapuram
Andhra Pradesh

More Telugu News