Andhra Pradesh: ఎన్నికల కోడ్ తర్వాత రూ.47.5 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం: ఏపీ సీఈవో

  • ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలు
  • చెక్ పోస్టుల వద్ద రూ.17.5 కోట్ల నగదు పట్టుకున్నామన్న సీఈవో
  • 5.13 లక్షల లీటర్ల మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి
AP CEO reveals seizures details amidst election code

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తనిఖీల్లో ఇప్పటివరకు రూ.47.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. 

చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో రూ.17.5 కోట్ల నగదు పట్టుబడిందని చెప్పారు. తనిఖీల్లో భాగంగా 5.13 లక్షల లీటర్ల మద్యం, మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో పంచి పెట్టేందుకు సిద్ధం చేసిన ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నామని సీఈవో వివరించారు. 

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వాటికి సంబంధించి 4,337 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా ఉల్లంఘనలకు సంబంధించి 247 కేసులు నమోదైనట్టు తెలిపారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా 8,681 లైసెన్స్ డ్ ఆయుధాలు పోలీస్ స్టేషన్లలో జమ చేశారని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వివరించారు.

More Telugu News