K Kavitha: లిక్కర్ కేసులో కీలక పరిణామం... కవితను విచారించేందుకు కోర్టులో సీబీఐ పిటిషన్

  • ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన ఈడీ
  • ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత
  • జైల్లోనే కవితను ప్రశ్నిస్తామన్న సీబీఐ
CBI files petition seeking courts permission to question Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు హాజరు కావాలంటూ కవితకు గతంలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు సంబంధించి తన పిటిషన్ కోర్టులో ఉందని... అందువల్ల తాను కోర్టుకు హాజరుకాలేనని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. 

కవితను జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో సీబీఐ కోరింది. కోర్టు అనుమతి మంజూరు చేస్తే.. జైల్లోనే ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. కేసులో సాక్షిగా ఉన్నప్పుడు కవితను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఆమెను సీబీఐ నిందితురాలిగా మార్చింది.

More Telugu News