Rashmika Mandanna: 'పుష్ప‌-2'లో శ్రీవ‌ల్లి లుక్ అదిరిపోయిందిగా..!

  • రష్మిక మంద‌న్న‌ పుట్టినరోజు సందర్భంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌
  • పుష్ప‌-2తో పాటు ది గ‌ర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో చిత్రాల్లో న‌టిస్తున్న బ్యూటీ
  • ఆగ‌స్టు 15వ తేదీన సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న 'పుష్ప‌: ది రూల్'
Pushpa 2 Movie First Look Poster of Rashmika Mandanna

అందాలభామ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె న‌టించిన పుష్ప‌-2 మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రం యూనిట్‌ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్‌లో శ్రీవ‌ల్లి అదిరిపోయింది. ఆకుప‌చ్చ‌ని చీర‌లో భారీగా న‌గ‌లు ధ‌రించి సింప్లీ సూప‌ర్బ్‌గా క‌నిపిస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం మూవీ సెట్ నుంచి లీక్ అయిన ర‌ష్మిక ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ర‌ష్మిక మంద‌న్న పుష్ప‌-2 తో పాటు ది గ‌ర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. ఇక ఆమె చివ‌రి చిత్రం యానిమల్ హిందీతో పాటు తెలుగులో కూడా సూప‌ర్‌ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. 

ఇక పుష్ప‌-2 మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగ‌స్టు 15వ తేదీన సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప‌: ది రూల్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత‌కుముందు వ‌చ్చిన పుష్ప చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. దానికి సీక్వెల్‌గానే 'పుష్ప‌-2' వ‌స్తోంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ నెల 8న హీరో అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పుష్ప మూవీ టీమ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో అభిమానులు టీజ‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News