CM Revanth Reddy: ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంకు సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy to Watch the Cricket Match in Uppal Cricket Stadium
  • క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు సాయంత్రం ఉప్ప‌ల్ స్టేడియానికి సీఎం
  • ఫ్యామిలీతో క‌లిసి ఐపీఎల్ మ్యాచ్ చూడ‌నున్న రేవంత్ రెడ్డి
  • రాత్రి 7.30 గంట‌ల‌కు సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌  
ఐపీఎల్‌లో భాగంగా శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించ‌డానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియానికి వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. కుటుంబం స‌హా మ్యాచ్ చూసేందుకు సీఎం ఇప్ప‌టికే టికెట్లు కూడా బుక్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో రేవంత్ రెడ్డి ఉప్ప‌ల్ మైదానంలో మ్యాచ్ చూసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ్టి చెన్నై మ్యాచులో కూడా చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ త‌మ చివ‌రి మ్యాచుల్లో ఓట‌మి చ‌విచూశాయి. మూడు మ్యాచులు ఆడిన చెన్నై రెండు గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. అలాగే మూడు మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఒకేఒక విజయంతో 7వ స్థానంలో కొన‌సాగుతోంది. ఈరోజు గెలిస్తే హైద‌రాబాద్ ఐదో స్థానానికి ఎగ‌బాకుతుంది.
CM Revanth Reddy
Cricket Match
Uppal Cricket Stadium
Hyderabad
Telangana
SRH
CSK
IPL 2024

More Telugu News