Rashmika Mandanna: 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్' చిత్రం నుంచి ర‌ష్మిక మంద‌న్న‌ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

  • రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ 
  • న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ
  • హేషం అబ్దుల్ వహ‌బ్ బాణీలు
Rashmika Mandanna New Movie The Girlfriend First Look Poster Released

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె న‌టించిన 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్' మూవీ నుంచి చిత్రం యూనిట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో మ‌రోసారి ర‌ష్మిక త‌న క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మాస్ మూవీ మేక‌ర్స్‌, ధీర‌జ్ మొగిలినేని ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హేషం అబ్దుల్ వహ‌బ్ బాణీలు అందిస్తున్నారు. 

శుక్ర‌వారం ర‌ష్మిక పుట్టిన రోజు సంద‌ర్భంగా మొద‌ట ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కావాల్సింది. కానీ, అనివార్య‌కార‌ణాల వ‌ల్ల టీజ‌ర్ విడుద‌ల వాయిదా ప‌డింది. దాంతో చిత్రం యూనిట్ పోస్టర్‌తో స‌రిపెట్టింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ భాషల్లో విడుద‌ల కానుంది. ఇక ర‌ష్మిక 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్' మూవీతో పాటు 'రెయిన్‌బో', 'పుష్ప‌-2' చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. ఆమె చివ‌రి చిత్రం 'యానిమల్' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

More Telugu News