విశాఖ ఆర్కేబీచ్ తీరంలో విషపూరిత జెల్లీఫిష్.. మత్స్యసంపదకు పెనుముప్పు!
- నిన్న విశాఖ తీరం వెంబడి పర్యటించిన శాస్త్రవేత్తల బృందం
- వేగంగా సంతతిని పెంచుకునే ఈ జెల్లీఫిష్ ప్రాణాంతకం
- తేలియాడే బెలూన్‌లా కనిపించే దీని పొడవు ఐదు సెంటీమీటర్లు మాత్రమే
దేశంలోని తీర్పు తీరంలో అరుదుగా కనిపించే జెల్లీఫిష్ మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. తేలియాడే బెలూన్‌ను పోలి ఉండే ఊదారంగులో ఉన్న జెల్లీఫిష్ జాతులను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. రుషికొండ వద్ద ఇసుక బీచ్‌లో రాళ్ల మధ్య నీటిలో వీటిని గుర్తించారు. ఇవి విరేచనాలు, నొప్పి, వాంతులు, అనాఫిలాక్టిక్ షాక్ వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరంపై వచ్చే మచ్చలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయని పేర్కొన్నారు. వీటి పునరుత్పత్తి రేటు ఎక్కవ కావడం వల్ల అతి తక్కువ సమయంలోనే ఇవి సంతతిని పెంచేసుకుంటాయని పేర్కొన్నారు.