YS Sharmila: ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన షర్మిల... ఆశీస్సులు అందించిన విజయమ్మ

Sharmila off to Congress election campaign
  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ఇప్పటికే ప్రచారం షురూ చేసిన ప్రధాన పార్టీలు
  • మీ రాజన్న బిడ్డను ఆశీర్వదించండి అంటూ షర్మిల ట్వీట్ 
ఏపీలో ఎన్నికల వేడి పూర్తిగా రాజుకున్నట్టే. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచార పర్వాన్ని షురూ చేయగా, కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి బయల్దేరుతున్నానంటూ నేడు ట్వీట్ చేశారు. 

"దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయల్దేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను" అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాదు, తల్లి విజయమ్మతో కలిసి ఉన్న ఫొటోలను కూడా పంచుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఏపీలో తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పలు ఆకర్షణీయ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని షర్మిల భావిస్తున్నారు.
YS Sharmila
Campiagn
Congress
Andhra Pradesh

More Telugu News