Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

  • చంద్రబాబు ఏ1గా చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ
  • ఈ కేసులో గతంలో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు
  • విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విచారణ 
AP CID files charge sheet in Skill Development Case

టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ నేడు చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణల పేర్లను సీఐడీ తన చార్జిషీట్ లో పేర్కొంది. చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లోనూ సీఐడీ చార్జిషీట్ సమర్పించింది. 

నాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

దాదాపు రెండు నెలల పాటు రాజమండ్రి జైల్లో గడిపిన చంద్రబాబు గతేడాది అక్టోబరు 31న విడుదలయ్యారు.

More Telugu News