Shubman Gill: శుభ్ మాన్ గిల్ దూకుడు... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి గుజరాత్
  • 48 బంతుల్లో 89 పరుగులు చేసిన గిల్ 
Gujarat Titans posts 199 runs with the help of Shubman Gill flamboyant innings

పంజాబ్ కింగ్స్ తో పోరులో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. 

కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 48 బంతుల్లోనే 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచి చివరి వరకు క్రీజులో నిలిచిన గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. కేన్ విలియమ్సన్ 26, సాయిసుదర్శన్ 33 పరుగులు చేశారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబాడా 2, హర్ ప్రీత్ బ్రార్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.

More Telugu News