Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి: బండి సంజయ్

  • రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శ
  • కాంగ్రెస్ కాళేశ్వరం అంటుంటే... బీఆర్ఎస్ కృష్ణ నీళ్లంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందన్న బండి సంజయ్
  • కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటుంటే... బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వడం లేదని అంటున్నారని విమర్శ
Bandi Sanjay lashes out at BRS and congress

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ కాళేశ్వరం అంటుంటే... బీఆర్ఎస్ కృష్ణ నీళ్లంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటుంటే... బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వడం లేదని అంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందన్నారు. 6 గ్యారెంటీల అమలుపై చర్చ సాగుతోందన్నారు. మహిళలకు రూ.2500, రూ.4000 పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. రైతు భరోసా రూ.15 వేలు ఎక్కడని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు రూ.15వేలు, వడ్లకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈ హామీలను నెరవేర్చనందున కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. 100 రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు 6 గ్యారెంటీలపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు.

More Telugu News