Andhra Pradesh: ఏపీలో ఇటీవల కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు... కొత్త నియామకాలు చేపట్టిన ఈసీ

  • ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లకు, ఆరుగురు ఐపీఎస్ లకు స్థానచలనం
  • కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్ల బదిలీ
  • పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లా ఎస్పీల బదిలీ
  • గుంటూరు రేంజి ఐజీ పాలరాజుకు స్థానచలనం
  • కొత్త కలెక్టర్లను, ఎస్పీలను, ఐజీని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు
EC appoints collectors for three districts in AP

ఏపీలో ఇటీవల ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఆరుగురు ఐపీఎస్ కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 

తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా, అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబులను ఈసీ బదిలీ చేసింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిలను బదిలీ చేసింది. గుంటూరు రేంజి ఐజీ పాలరాజును కూడా బదిలీ చేసింది. కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనుండగా, వీరిని బదిలీ చేయడం చర్చనీయాంశం అయింది. 

ఈ క్రమంలో, బదిలీ చేసిన స్థానాల్లో ఈసీ తాజా నియామకాలు చేపట్టింది. తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్, అనంతపురం కలెక్టర్ గా వినోద్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ గా డీకే బాలాజీలను నియమిస్తూ ఈసీ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 

గుంటూరు రేంజి ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీని నియమించింది. ఇక, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలును నియమించింది.

More Telugu News