రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మార్చిన పవన్ కల్యాణ్... అరవ శ్రీధర్ కు టికెట్
- రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిగా తొలుత యనమల భాస్కర్ రావు పేరు ప్రకటన
- క్షేత్రస్థాయిలో నివేదికలు, నేతల అభిప్రాయాలతో మనసు మార్చుకున్న పవన్
- మూడ్రోజుల కిందటే పార్టీలో చేరిన అరవ శ్రీధర్ కు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం
- ముక్కావారిపల్లె సర్పంచిగా ఉన్న అరవ శ్రీధర్
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ వర్గాలతో చర్చించిన పవన్... రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అరవ శ్రీధర్ ను రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు.
అరవ శ్రీధర్ మూడ్రోజుల కిందటే తన అనుచరులతో సహా జనసేనలో చేరారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.