Pakistan: త‌ల్లి మొబైల్ ఫోన్ ఇవ్వ‌లేద‌ని.. మైన‌ర్ బాలుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

  • పాకిస్థాన్‌లోని రాయ్‌విండ్ ప‌ట్ట‌ణంలో ఘ‌ట‌న‌
  • త‌ల్లి ఫోన్ ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో ఉరి వేసుకున్న 12 ఏళ్ల బాలుడు
  • ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ పోలీసులు
Minor Boy Hangs Himself to Death in Raiwind After Mother Refuses to Give Him Mobile Phone

12 ఏళ్ల ఓ మైన‌ర్ బాలుడు త‌ల్లి మొబైల్ ఫోన్ ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ విషాద ఘ‌ట‌న పాకిస్థాన్‌లోని రాయ్‌విండ్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. లాహోర్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అయ్య‌న్ (12) అనే బాలుడు త‌న త‌ల్లి వ‌ద్ద మొబైల్‌ ఫోన్ ఇవ్వాల‌ని అడిగాడు. కానీ, ఆమె కుమారుడికి ఫోన్ ఇవ్వడానికి నిరాక‌రించింది. ప‌క్కింట్లో వారికి చెప్పి ఆమె బ‌య‌టికి వెళ్లిపోయింది. త‌ల్లి మొబైల్ ఫోన్ ఇవ్వ‌లేద‌నే మ‌న‌స్తాపంతో బాలుడు ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. 

కొద్దిసేప‌టి త‌ర్వాత ఇంటికి తిరిగి వ‌చ్చిన ఆమెకు కుమారుడు అయ్య‌న్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించాడు. మెడ‌కు తాడు బిగించుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఇలాంటి మ‌రో విషాద ఘ‌ట‌న ఇటీవ‌ల లాహోర్‌లోని మఘ‌ల్‌పురాలో చోటు చేసుకుంది. 33 ఏళ్ల ఓ వైద్యురాలు త‌ల్లితో మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ప్రాణాలు తీసుకుంది. బుష్రా సుహైల్ అనే వైద్యురాలు త‌ల్లితో గొడ‌వప‌డి గ‌దిలోకి వెళ్లి డోర్లు వేసుకుంది. అనంత‌రం గ‌దిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

More Telugu News