YS Avinash Reddy: చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాశ్ రెడ్డి

  • అవ్వాతాతల పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారన్న అవినాశ్
  • ఇంటికో ఉద్యోగం అన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శ
  • రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని ఎద్దేవా
We have to teach a lesson to Chandrababu says YS Avinash Reddy

అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. మండుటెండల్లో పెన్షన్ల కోసం వెళ్లిన పలువురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. 

కూటమి పేరుతో ఇతర పార్టీలను కూడగట్టుకుని చంద్రబాబు వస్తున్నారని అవినాశ్ అన్నారు. 2014లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారని... అప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో రైతు రుణమాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్న హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. రంగురంగుల మేనిఫెస్టోతో ఇప్పుడు ఎన్నికలకు వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

More Telugu News