Kona Venkat: అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా: కోన వెంకట్

I will do hunger strike infront of Junior NTR home says Kona Venkat
  • జూనియర్ ఎన్టీఆర్ తో 'అదుర్స్ 2' సినిమా కచ్చితంగా చేస్తానన్న కోన వెంకట్
  • 'అదుర్స్'లో ఎన్టీఆర్ పోషించిన చారి పాత్రను ఎవరూ చేయలేరని కితాబు
  • తారక్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అద్భుతమని ప్రశంస
జూనియర్ ఎన్టీఆర్ తో 'అదుర్స్ 2' సినిమా చేస్తాననే విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ చెప్పారు. 2010లో విడుదలైన 'అదుర్స్' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కోన వెంకట్ రచయితగా పని చేశారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించారు. నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందంల కామెడీ ప్రేక్షకులను బాగా మెప్పించింది. 

నిన్న జరిగిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ... 'అదుర్స్ 2' కచ్చితంగా చేస్తామని చెప్పారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి, పిలక పెట్టుకుని నిరాహారదీక్ష చేస్తానని అన్నారు. 'అదుర్స్'లో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రను టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఎవరూ చేయలేరని చెప్పారు. డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని కితాబునిచ్చారు. మరి 'అదుర్స్ 2'కు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా? కోన వెంకట్ కోరిక నెరవేరుతుందా? అనేది వేచి చూడాలి. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే. 
Kona Venkat
Junior NTR
Adurs 2
Tollywood

More Telugu News