Mukesh Ambani: భారత్ లోనూ, ఆసియాలోనూ నెంబర్ వన్ సంపన్నుడిగా ముఖేశ్ అంబానీ

  • ఈ ఏడాది భారీగా పెరిగిన అంబానీ సంపద
  • ముఖేశ్ అంబానీ ఆస్తి విలువ రూ.9.68 లక్షల కోట్లు
  • ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ కు 9వ స్థానం
Mukesh Ambani emerges as number one billionaire in India and Asia

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా జాబితాలో ముఖేశ్ అంబానీ నెంబర్ వన్ స్థానాన్ని అలంకరించారు. అంతేకాదు, ఆసియాలోనూ అంబానీనే అగ్రస్థానంలో ఉన్నారు. 

ప్రస్తుతం ముఖేశ్ అంబానీ సంపద విలువ రూ.9.68 లక్షల కోట్లు అని ఫోర్బ్స్ పేర్కొంది. గతేడాది ఆయన ఆస్తి విలువ రూ.6.92 లక్షల కోట్లు అని వెల్లడించింది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీకి 9వ స్థానం లభించింది. 

భారత్ లో ముఖేశ్ అంబానీ తర్వాత స్థానాల్లో గౌతమ్ అదానీ (రూ.7 లక్షల కోట్లు), శివనాడార్ (రూ.3 లక్షల కోట్లు), సావిత్రి జిందాల్ (రూ.2.79 లక్షల కోట్లు), దిలీప్ సంఘ్వీ (రూ.2.22 లక్షల కోట్లు) టాప్-5లో ఉన్నారు. 

కాగా, భారత్ లో బిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది. 2023లో భారత్ లో బిలియనీర్ల సంఖ్య 169 కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 200కి పెరిగినట్టు వివరించింది.

More Telugu News