Fire Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం... రియాక్టర్ పేలి ప్లాంట్ మేనేజర్ సహా ఏడుగురి మృతి

  • సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ప్రమాదం
  • ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు
  • ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్ మేనేజర్ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృత‌దేహాల‌ను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలముకున్నాయి. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Fire Accident
Sangareddy District
Telangana
Crime News

More Telugu News