ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెనాలి వస్తాను: పవన్ కల్యాణ్
- గత కొన్నిరోజులుగా పవన్ కు అస్వస్థత
- నిన్న పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన వైనం
- తీవ్ర జ్వరం రావడంతో పిఠాపురం నుంచి హైదరాబాద్ పయనం
- నేడు జరగాల్సిన తెనాలి సభ వాయిదా
వాస్తవానికి పవన్ ఇవాళ తెనాలిలో వారాహి విజయభేరి సభలో పాల్గొనాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్లిపోవడంతో ఈ సభ వాయిదా పడింది.
పవన్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లోనూ, జనసేన పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అస్వస్థతకు గురికావడం వల్ల తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెనాలి విచ్చేసి, వారాహి సభలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.