Machilipatnam: మచిలీపట్నంలో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీ... వీఆర్వో శ్రీదేవి సస్పెన్షన్

  • మచిలీపట్నంలో 11వ డివిజన్ వీఆర్వోగా పనిచేస్తున్న శ్రీదేవి
  • హద్దులు, సర్వే నెంబర్లు లేకుండానే ఇళ్ల పట్టాలు రూపొందించారని ఆరోపణలు
  • విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్
  • ఈ వ్యవహారంలో శ్రీదేవి పాత్ర ఉందని నిర్ధారణ 
VRO Sridevi suspended in Machilipatnam

మచిలీపట్నంలో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వీఆర్వో శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీదేవి మచిలీపట్నంలో 11వ డివిజన్ వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇటీవల మచిలీపట్నంలో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం వెలుగుచూసింది. హద్దులు, సర్వే నెంబర్లు లేకుండానే ఇళ్ల పట్టాలు సిద్ధం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 

దీనిపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో 11వ డివిజన్ వీఆర్వో శ్రీదేవి పాత్ర ఉందని అధికారులు నిర్ధారించారు. రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే పట్టాలు రూపొందించినట్టు ఆర్డీవో వాణి వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన వీఆర్వో శ్రీదేవిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News