ప్రియుడిని పెళ్లాడిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. అసలు విషయం ఏమిటంటే..!
- 'జానకి కలగనలేదు' సీరియల్ తో పాప్యులర్ అయిన ప్రియాంక జైన్
- బుల్లితెర నటుడు శివకుమార్ ప్రేమలో ప్రియాంక
- ఓ షూటింగ్ లో భాగంగా పెళ్లి చేసుకున్న ప్రేమికులు
అయితే, తన అభిమానులకు ప్రియాంక షాక్ ఇచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండానే ప్రియుడిని పెళ్లాడింది. తమ పెళ్లి అయిపోయింది అంటూ కొత్త దంపతులు ఇద్దరూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ పెళ్లి వీడియో చూసి అందరూ నిజమే అనుకున్నారు. కానీ, అది నిజమైన పెళ్లి కాదు. ఓ షూటింగ్ లో భాగంగా తీసింది. ఉగాది పండుగ సందర్భంగా 'మా ఇంటి పండుగ' అనే షూటింగ్ జరిగింది. ఇందులో భాగంగానే ప్రియాంక, శివకుమార్ ల పెళ్లి జరిగింది.