Killi Kruparani: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కిల్లి కృపారాణి

  • జగన్ తనను మోసం చేశారన్న కృపారాణి
  • పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదని ఆవేదన
  • పదవుల కంటే తనకు గౌరవమే ముఖ్యమని వ్యాఖ్య
Killi Kruparani resigns to YSRCP

ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురయింది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. ఆమెకు జగన్ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు. 

ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ... తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విమర్శించారు. తనకు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదని చెప్పారు. పదవుల కంటే తనకు వ్యక్తిగత గౌరవమే ముఖ్యమని అన్నారు. తనకు గౌరవం ఎక్కడుంటే అక్కడకు వెళ్తానని చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

More Telugu News