టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన
- జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ
- పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం
- నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు
అదే సమయంలో ఆ ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన మరో ట్రైన్ వినోద్ ను ఢీ కొట్టింది. దీంతో వినోద్ శరీరం ముక్కలుముక్కలై చనిపోయాడు. ముళంగున్నతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్‌ల మధ్య జరిగింది. ఈ షాకింగ్ ఘటన చూసి నివ్వెరపోయిన మిగతా ప్రయాణికులు కాసేపటికి తేరుకుని నిందితుడు రజనీకాంత్ పారిపోకుండా పట్టుకున్నారు. తర్వాతి స్టేషన్ లో రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుల సమాచారంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వినోద్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.