Pluto: ప్లూటోను అధికారిక గ్రహంగా ప్రకటించిన అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం

US state Arizona declared Pluto as official planet of the state
  • 2006లో గ్రహం హోదాను కోల్పోయిన ప్లూటో
  • సౌర కుటుంబంలోని ఓ వస్తువు అంటూ తేల్చేసిన పరిశోధకులు
  • అయినప్పటికీ, ప్లూటోకు గొప్ప హోదా ఇచ్చిన ఆరిజోనా
కొన్నాళ్ల కిందటి వరకు నవ గ్రహాల్లో చిట్టచివరిదిగా గుర్తింపు ఉన్న ప్లూటో... 2006లో గ్రహం హోదా కోల్పోయింది. అది మరుగుజ్జు గ్రహమని, సౌర కుటుంబంలోని ఓ వస్తు రూప పదార్థం మాత్రమేనని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 

అయినప్పటికీ, అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ప్లూటోను తమ రాష్ట్ర అధికారిక గ్రహంగా ప్రకటించింది. ఈ మేరకు బిల్లుపై ఆరిజోనా రాష్ట్ర గవర్నర్ కేటీ హాబ్స్ ఆమోద ముద్ర వేశారు. అయితే, ప్లూటోను ఒక పూర్తిస్థాయి గ్రహంగా మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు కేటీ హాబ్స్ సమాధానం దాటవేశారు. అందుకు బదులుగా అమెరికా అంతరిక్ష పరిశోధనల్లో ఆరిజోనా పరిశోధకుల భాగస్వామ్యాన్ని, వారి ఘనతలను కొనియాడారు.

అమెరికా ఖగోళ శాస్త్రవేత్త క్లైడ్ టోంబా 1930లో ఆరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటరీ నుంచి ప్లూటోను గుర్తించారు. మిగిలిన గ్రహాలను అమెరికా వెలుపలే ఆవిష్కరించగా, అమెరికాలో ఒక్క ప్లూటోను మాత్రమే గుర్తించారు.
Pluto
Official Planet
Arizona
USA

More Telugu News