Chandrababu: ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి... పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మనడం సరికాదు: చంద్రబాబు

  • వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాలన్న ఈసీ
  • సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు
  • వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడతారన్న చంద్రబాబు
  • మండే ఎండల్లో వారిని సచివాలయాలకు తిప్పించుకోవడం మానవత్వం కాదని హితవు
Chandrababu tweet on pensions

ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్ధులను, దివ్యాంగులను, ఇతర పెన్షన్ లబ్ధిదారులను మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అందుకే పెన్షన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర సీఎస్ కు సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశానని వెల్లడించారు.

More Telugu News