Sharad Pawar: దేశం మూడ్ ఇప్పుడు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మారింది: శరద్ పవార్

Mood of people turning against PM Modi
  • జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఇంకా ఆలోచన చేయలేదని వ్యాఖ్య
  • సంజయ్ సింగ్ విడుదలతో మద్యం కేసులో నిజం బయటపడుతుందన్న పవార్

దేశం యొక్క మూడ్ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మారిందని ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత  శరద్ పవార్ అన్నారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థల ద్వారా దాడులను ఆయన ఖండించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రజల మూడ్ (ఆలోతన) మారిందని తాను భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం మోదీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని చెప్పారు.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఇంకా ఆలోచన చేయలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి లోక్ సభ స్థానాల పంపకాలపై ప్రశ్నించగా తాను జ్యోతిష్కుడిని కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ చిన్న చిన్న అంశాలపై దృష్టి సారిస్తున్నారని, కానీ వేలాది చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకోవడంపై ఆయన మౌనంగా ఉన్నారని ఆరోపించారు. కానీ ఇందిరాగాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. జాతి ప్రయోజనాలపై ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు.

సంజ‌య్ సింగ్ విడుద‌ల‌తో నిజం బ‌య‌ట‌ప‌డుతుంది

మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంపై శ‌ర‌ద్ ప‌వార్ స్పందించారు. సంజ‌య్ సింగ్‌ను అరెస్ట్ చేసి అత‌డికి అన్యాయం చేశార‌ని, ఇప్పుడు ఆయ‌న విడుదల కావడం శుభ ప‌రిణామ‌మ‌న్నారు. ఆయన విడుదల కావడంతో ఇప్పుడు దేశానికి నిజం తెలుస్తుందన్నారు.

  • Loading...

More Telugu News