Vijayasai: 2029 నాటికి చంద్రబాబు కదలలేని స్థితిలో ఉండొచ్చు: విజయసాయిరెడ్డి

vijayasai reddy comments on chandrababu
  • చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన విజయసాయి
  • జనాలు రాకపోయినా రోడ్ల మీద తిరుగుతూనే ఉండండి అని ఎద్దేవా
  • బెయిల్ కోసం వంద జబ్బుల లిస్టును బయట పెట్టారని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా విజయసాయి స్పందిస్తూ... జనాలు వచ్చినా, రాకున్నా... మీ సోది ప్రసంగం వినలేక మధ్యలో లేచిపోయినా... రోడ్ల మీద తిరుగుతూనే ఉండండి చంద్రబాబు గారు అని ఆయన ఎద్దేవా చేశారు. మీకు ఇవే చివరి ఎన్నికలు అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఎండల్లో తిరిగే అవకాశం చంద్రబాబుకు రాదని చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబు వయసును ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి చంద్రబాబు వృద్ధాప్యం కారణంగా కనీసం కదలలేని స్థితిలో ఉండొచ్చని అన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం వంద జబ్బుల లిస్టును బయట పెట్టారుగా అంటూ దెప్పిపొడిచారు.  
Vijayasai
YSRCP
Chandrababu
Telugudesam
AP Politics

More Telugu News