Chiranjeevi: చిరంజీవిగారు ఆ మాట అనగానే నేను షాక్ అయ్యాను: సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి!

  • 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో బుక్ రిలీజ్ 
  • పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి దంపతులు 
  • అమ్మ ఎందుకు మహానటి అయిందన్నది చెప్పడమే పుస్తకం ముఖ్యోద్దేశమని వెల్లడి  
Savithri Book Release Function

మహానటి సావిత్రిపై ఆమె కూతురు విజయ చాముండేశ్వరి 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో ఒక బుక్ వేయించారు. సంజయ్ కిశోర్ రూపొందించిన ఈ పుస్తకాన్ని, ముఖ్య అతిథులుగా కొంతసేపటి క్రితం చిరంజీవి దంపతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మురళీమోహన్ .. బ్రహ్మానందం .. తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై విజయ చాముండేశ్వరిని సురేఖ ఇంటర్వ్యూ చేయడం విశేషం.

చిరంజీవిగారి చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఎందుకు ఆవిష్కరించాలనున్నారు? అంటూ సురేఖ అడిగిన ప్రశ్నకి  విజయ చాముండేశ్వరి స్పందిస్తూ .. " అమ్మ ఎందుకు మహానటి అయింది .. ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు .. పాత్రలను గురించి ఒక బుక్ వేయాలనుకున్నాను. సినిమాల ఫోటోలు .. ఆ సినిమా గురించిన సమాచారం బుక్ లో ఉంటే బాగుంటుందని అలాగే డిజైన్ చేయించాము. ఈ బుక్ ను చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని అనుకున్నాము" అని అన్నారు. 

"ఒకసారి నేను చిరంజీవిగారి ఇంటికి వెళ్లినప్పుడు .. కాలు నొప్పిగా ఉన్నప్పటికీ ఆయన మేడ దిగి వచ్చారు. తాను ఉదయాన్నే నిద్ర లేవగానే సావిత్రిగారి ఫొటోను చూస్తానని చిరంజీవిగారు చెప్పారు. నేను నమ్ముతానో లేదోనని చెప్పి బెడ్ రూమ్ కి వెళ్లి అమ్మ ఫొటో తీసుకొచ్చి చూపించారు. అమ్మపై అంత అభిమానమున్న చిరంజీవిగారితోనే ఈ బుక్ ను ఆవిష్కరించడం జరిగింది" అని ఆమె చెప్పారు. 

More Telugu News