Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సోదరుడు

Chandrababu welcomes Katasani Chandrasekhar Reddy into TDP
  • వైసీపీకి గుడ్ బై చెప్పిన పలువురు సీనియర్ నేతలు
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
  • టీడీపీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికిన చంద్రబాబు
వైసీపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కారు.వైసీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు దంపతులు, అనుచరులు ఇవాళ టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 

2014 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేసిన వీఆర్ రామిరెడ్డితో పాటు ఆయన కుమారులు వీఆర్.వెంకటేశ్వరరెడ్డి(వైసీపీ రాష్ట్ర కార్యదర్శి), విఘ్నేశ్వరరెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Chandrababu
Katasani
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News