Stock Market: ప్రాఫిట్ బుకింగ్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 110 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం వరకు నష్టపోయిన కోటక్ బ్యాంక్ షేర్ల విలువ
Markets ends in losses

నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 73,903కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 22,453 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టపోయాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.95%), నెస్లే ఇండియా (1.42%), టాటా మోటార్స్ (1.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.11%). 

 బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
 కోటక్ బ్యాంక్ (-1.84%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.52%), సన్ ఫార్మా (-0.90%), ఇన్ఫోసిస్ (-0.90%).

More Telugu News