KCR: కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

  • మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు
  • ఈ కేసులో ఏ4 నిందితుడిగా కన్నారావు
  • బాధితుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ భూవివాదం కేసులో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా 38 మందిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ జరిగింది.

గత నెల 3న బాధితుడు బండోజు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఈ భూవివాదానికి సంబంధించి కన్నారావు రూ.4 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో రూ.40 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమిలోని ఫర్నీచర్‌ను తగులబెట్టారు. భూమి యజమానులను బెదిరించారు. ఇల్లీగల్‌గా ట్రెస్ పాస్, బెదిరింపులకు గురి చేయడం, భూమిని ఖాళీ చేయాలని దౌర్జన్యం చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కన్నారావుపై పోలీసులు గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

More Telugu News