Mahesh Babu: నెట్టింట వైర‌ల్ అవుతున్న మ‌హేశ్ బాబు కొత్త ఫొటోలు

  • 'ఎక్స్' వేదిక‌గా లేటెస్ట్ పిక్స్ పంచుకున్న సూప‌ర్ స్టార్‌
  • మ‌హేశ్ చాలా ఫ్రెష్ లుక్‌లో అందంగా క‌నిపిస్తున్నారంటున్న ఫ్యాన్స్‌
  • 'షేప్ యువ‌ర్ స్టోరీ' అనే ట్యాగ్‌తో ఫొటోల‌ను షేర్ చేసిన మ‌హేశ్ బాబు
  • ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమా కోసం ప్రిపేర్ అయ్యే ప‌నిలో ప్రిన్స్‌
Mahesh Babu shares his latest pics goes viral

ప్రిన్స్ మ‌హేశ్ బాబు తాజాగా త‌న 'ఎక్స్' (ట్విట‌ర్) ఖాతా ద్వారా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో మ‌హేశ్ చాలా ఫ్రెష్ లుక్‌లో అందంగా క‌నిపిస్తున్నారు. మొత్తం నాలుగు ఫొటోల‌ను 'షేప్ యువ‌ర్ స్టోరీ' అనే ట్యాగ్‌తో మ‌హేశ్ బాబు అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ మ‌హేశ్ లుక్స్ అదుర్స్ అని అంటున్నారు. 

ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో మ‌హేశ్ పూర్తి డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో సూప‌ర్ స్టార్ ఉన్నారు. దీనిలో భాగంగా రాజ‌మౌళి సూచ‌న మేర‌కు ఇప్ప‌టికే విదేశాల‌కు కూడా వెళ్లొచ్చారు. కాగా, ఈ సినిమా ఓ అడ్వెంచర్ డ్రామాగా ఉండ‌బోతుంద‌ని ర‌చ‌యిత విజేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు.

More Telugu News