Pawan Kalyan: పిఠాపురంలో పవన్ బిజీబిజీ.. ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు

Pawan Busy in Pithapuram Prayers at Andhra Baptist Church
  • నేడు నాలుగో రోజు పర్యటిస్తున్న జనసేనాని
  • ప్రార్థనల అనంతరం పొన్నాడ బషీర్ బీబీ దర్గాకు పవన్
  • రేపు తెనాలిలో పర్యటన..12 వరకు తీరికలేని షెడ్యూల్
రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం అవుతారు. కాగా, పిఠాపురంలో పవన్ నాలుగో రోజు పర్యటనలో బీజీగా గడుపుతున్నారు.

     పవన్ నేడు పిఠాపురం పర్యటనను ముగించుకుని రేపు తెనాలి వెళ్తారు. 4న  నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 9న ఉగాది సందర్భంగా పిఠాపురంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు. 



Pawan Kalyan
Janasena
Pithapuram
Kakinada
Andhra News

More Telugu News