TSRTC: టీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్ల‌లో రూ. 151 క‌డితే.. ఇంటికే రాములోరి క‌ల్యాణ త‌లంబ్రాలు

  • దేవాదాయ శాఖ స‌హ‌కారంతో రాములోరి త‌లంబ్రాల‌ను భ‌క్తుల ఇళ్ల‌కు చేర‌వేసేందుకు సిద్ధ‌మైన టీఎస్ఆర్‌టీసీ 
  • భ‌ద్రాచ‌లంలో సీతారాముల క‌ల్యాణోత్స‌వం త‌ర్వాత‌ త‌లంబ్రాల‌ను భ‌క్తుల‌కు హోం డెలివ‌రీ చేయ‌నున్న సంస్థ‌
  • బ‌స్ భ‌వ‌న్‌లో భ‌ద్రాద్రి సీతారాముల క‌ల్యాణ త‌లంబ్రాల బుకింగ్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంస్థ ఎండీ స‌జ్జ‌నార్ 
  • 2022లో 89 వేల మందికి, 2023లో 1.17 లక్ష‌ల మంది భ‌క్తులకు త‌లంబ్రాలు అంద‌జేసిన ఆర్‌టీసీ
  • స్వామివారి త‌లంబ్రాలు కావాల్సిన భ‌క్తులు 040-23450033, 040-69440000, 040-69440069 నంబ‌ర్ల ద్వారా సంప్ర‌దించాల‌ని టీఎస్ఆర్‌టీసీ ఎండీ వెల్ల‌డి
If you Pay Rs151 and you will get Ramulori Talambralu at Home says TSRTC

టీఎస్ఆర్‌టీసీ గ‌తేడాది మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ స‌హ‌కారంతో రాములోరి క‌ల్యాణ త‌లంబ్రాల‌ను భ‌క్తుల ఇళ్ల‌కు చేర‌వేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ త‌లంబ్రాలు కావాల్సిన భ‌క్తులు టీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్ల‌లో రూ. 151 చెల్లించి త‌మ వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లంలో నిర్వ‌హించే సీతారామ‌చంద్రుల క‌ల్యాణోత్స‌వం అనంత‌రం త‌లంబ్రాల‌ను భ‌క్తుల‌కు ఆర్‌టీసీ హోం డెలివ‌రీ చేస్తుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. 

దీనిలో భాగంగా సోమ‌వారం బ‌స్ భ‌వ‌న్‌లో భ‌ద్రాద్రి సీతారాముల క‌ల్యాణ త‌లంబ్రాల బుకింగ్ పోస్ట‌ర్‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "అత్యంత నియ‌మ నిష్ట‌ల‌తో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజ‌ల‌ను త‌లంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో వినియోగించ‌డం జ‌రుగుతుంది. ఈ త‌లంబ్రాల‌ను భ‌క్తులు ఇంటికి చేర్చే ప‌విత్ర కార్యానికి ఆర్‌టీసీ సంస్థ రెండేళ్ల క్రిత‌మే శ్రీకారం చుట్టింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌లంబ్రాల‌ను బుక్ చేసుకుంటున్నారు. గ‌తేడాది 1.17 లక్ష‌ల మంది భ‌క్తులు త‌లంబ్రాలు బుక్ చేసుకోవ‌డం జ‌రిగింది. అలాగే 2022లో 89 వేల మందికి త‌లంబ్రాలు అంద‌జేశాం" అని స‌జ్జనార్ తెలిపారు.   

ఇక రాములోరి క‌ల్యాణ త‌లంబ్రాలు కావాల‌నుకునే భ‌క్తులు ఆర్‌టీసీ కాల్ సెంట‌ర్ 040-23450033, 040-69440000, 040-69440069 నంబ‌ర్ల ద్వారా సంప్ర‌దించాల‌ని స‌జ్జ‌నార్ తెలియ‌జేశారు.

More Telugu News