Visakha South: విశాఖ సౌత్ జన సేన అభ్యర్థిని ఖరారు చేసిన పవన్

Pawan Kalyan finalised Janasena candidate for Visakha South constituency
  • ఏపీలో జనసేన-టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు
  • 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన
  • విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
ఏపీలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇటీవల చాలా వరకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్, తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. విశాఖ సౌత్ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. దాంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై మరో రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Visakha South
Vamsikrishna Srinivas Yadav
Pawan Kalyan
Assembly Elections

More Telugu News