Anantapur District: సీఎం జగన్ బస్సుపైకి చెప్పు.. గుత్తిలో ఘటన

Slippers thrown at Jagans bus in guththi in Andhrapradesh
  • గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరన వైనం
  • ఘటన సమయంలో బస్సులో సీఎంతో పాటు  గుంతకల్లు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ 
  • చెప్పు ఎవరిపైనా పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సుపైకి చెప్పు విసిరిన ఘటన కలకలానికి దారి తీసింది. గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద బస్సు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా పైనుంచి పడుతున్న చెప్పును చూసి పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

ఘటన జరిగిన సమయంలో బస్సుపై సీఎంతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నైరుతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్నా ఎవరిపైనా చెప్పు పడలేదు. ఈ ఘటనపై వైసీపీ నేతలు, పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.
Anantapur District
Guththi
YS Jagan
YSRCP

More Telugu News