Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

  • ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థుల ప్రకటన
  • పెండింగ్‌లోని నాలుగు స్థానాల్లో అభ్యర్థులపై అధిష్ఠానంతో చర్చించనున్న సీఎం
  • ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్ కమిటీ
Revanth Reddy will go delhi tomorrow

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయడానికి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానంతో మాట్లాడి, ఆశావహులపై చర్చించి అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండటంతో రేపు అధిష్ఠానంతో చర్చించి పేర్లు ఖరారు చేస్తారు.

కేకే ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం కే కేశవరావు నివాసానికి వెళ్లారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరిక కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కేకే నివాసానికి వెళ్లిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, తదితరులు ఉన్నారు.

More Telugu News