AP DSC: ఎన్నిక‌ల ఎఫెక్ట్.. ఏపీ డీఎస్‌సీ వాయిదా!

  • ఎన్నిక‌ల కోడ్‌ ముగిసిన త‌ర్వాతే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ ఆదేశం
  • దీంతో జూన్ 4 త‌ర్వాతే డీఎస్‌సీ ప‌రీక్ష‌లు జ‌రిగే అవ‌కాశం
  • అలాగే టెట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఈసీ వెల్ల‌డి
AP DSC Postponed due to Elections

ఏపీలో ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్ష (డీఎస్‌సీ) నిర్వహ‌ణ‌పై సందిగ్ధ‌త‌కు తెర ప‌డింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌తో డీఎస్‌సీ వాయిదా ప‌డింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు డీఎస్‌సీ ఎగ్జామ్స్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఎన్నిక‌ల కోడ్‌ ముగిసిన త‌ర్వాతే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ ఆదేశించింది. దీంతో జూన్ 4 త‌ర్వాత డీఎస్‌సీ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

మార్చి 20 నుంచి ప‌రీక్షా కేంద్రాల వెబ్ ఆప్ష‌న్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జ‌ర‌గాల్సి ఉంది. కానీ, ఇప్ప‌టివ‌ర‌కు ప‌రీక్ష కేంద్రాల వెబ్ ఆప్ష‌న్ ఎంపిక‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక శ‌నివారం ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా ప‌డింది. ఎన్నిక‌ల కోడ్ ముగిసే వ‌ర‌కు డీఎస్‌సీని వాయిదా వేయాల‌ని సీఈసీ స్ప‌ష్టం చేసింది. అలాగే ఎన్నిక‌ల కోడ్ ముగిసే వ‌ర‌కు ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఈసీ వెల్ల‌డించింది.

More Telugu News