Chandrababu Naidu: ఈసారి జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఓడించ‌డం ఖాయం.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్‌సీ: చంద్ర‌బాబు

TDP President Nara Chandrababu Naidu Speech at Srikalahasti Prajagalam Sabha
  • శ్రీకాళ‌హ‌స్తి ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగం
  • ఛార్జీలు పెంచ‌కుండా కోత‌లు లేని విద్యుత్ ఇచ్చామ‌న్న టీడీపీ అధినేత‌
  • ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ఉక్కుపాదం మోపిన‌ట్లు వెల్ల‌డి
  • రేణిగుంట‌లో ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేశామ‌న్న చంద్ర‌బాబు
  • నెల్లూరులో ఓ ఎయిర్‌పోర్టు నిర్మించాల‌ని భావించాన‌ని వ్యాఖ్య‌
  • మ‌న సభ‌లు జ‌నంతో ‌కళకళ.. జ‌గ‌న్ స‌భ‌లు వెల‌వెల అంటూ ఎద్దేవా
శ్రీకాళ‌హ‌స్తి ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈసారి జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఓడించ‌డం ఖాయ‌మ‌ని, నిరుద్యోగులు బాధ ప‌డకూడదని తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్‌సీ వేస్తామన్నారు. ఛార్జీలు పెంచ‌కుండా కోత‌లు లేని విద్యుత్ స‌ర‌ఫ‌రా చేశామ‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ఉక్కుపాదం మోపిన‌ట్లు పేర్కొన్నారు. రేణిగుంట‌లో ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. మ‌నం ప‌రిశ్ర‌మ‌లు తెస్తే వైసీపీ నేత‌లు వాటి నుంచి వ‌సూళ్లు మొద‌లుపెట్టార‌ని ఎద్దేవా చేశారు. 

అలాగే రేణిగుంట విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా తీర్చిదిద్దామ‌ని చెప్పారు. నెల్లూరులో కూడా ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాల‌నుకున్న‌ట్లు టీడీపీ అధినేత వెల్ల‌డించారు. టీడీపీ కూట‌మి స‌భ‌లు జ‌నంతో కళకళలాడుతుంటే.. జ‌గ‌న్ స‌భ‌లు వెలవెల బోతున్నాయ‌న్నారు. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న స్థానిక అభ్య‌ర్థి గోపాల‌కృష్ణా రెడ్డి ప‌ద‌వి ఉంటే ఒదిగి ప‌నిచేసే మంచి మ‌నిషి అని చెప్పారు. ఈసారి జ‌నం ఆలోచించి ఓటు వేయాల‌ని చంద్ర‌బాబు కోరారు.  
Chandrababu Naidu
TDP
Srikalahasti Prajagalam Sabha
AP Politics

More Telugu News