Telangana: తెలంగాణ‌లో భానుడి భ‌గ‌భ‌గ‌లు.. ఆ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌!

  • సాధార‌ణం క‌న్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్న వైనం
  • రేప‌టి నుంచి  40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ‌
  • ఈ నేప‌థ్యంలోనే క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్
Due to Summer Season Temperature Increased in Telangana

తెలంగాణ‌లో భానుడి ప్ర‌తాపం మొద‌ల‌యింది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరుగుతున్నాయి. వేస‌వి ప్రారంభంలోనే సాధార‌ణం క‌న్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రెండు నెల‌లు ఎండ‌లు మండిపోవ‌డం ఖాయం. ఇక ఆదివారం నుంచి తీవ్ర వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 

అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలోనే క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ‌, మంచిర్యాల‌, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి, పెద్ద‌ప‌ల్లి జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అవ‌స‌రం ఉంటే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

More Telugu News