Vijayasai Reddy: ఆయన నాకు దేవుడితో సమానం: విజయసాయిరెడ్డి

Maheedhar Reddy is like God to me says Vijayasai Reddy
  • నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి
  • కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన విజయసాయి
  • మహీధర్ రెడ్డి తనకు చేసిన మేలు మర్చిపోలేనని వ్యాఖ్య
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కందుకూరులో పిలిస్తే పలికే దేవుడిగా మహీందర్ రెడ్డి అన్నను ప్రజలు కొలుస్తారని కొనియాడారు. ఆయన తనకు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. ఆయన తనకు గురువుతో సమానమని అన్నారు. 

మహీధర్ రెడ్డి కందుకూరులో పోటీ చేయాలని తాను కోరుకున్నానని... అయితే సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా పార్టీ అధినేత జగన్ బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించారని విజయసాయి తెలిపారు. భవిష్యత్తులో కూడా మహీధర్ రెడ్డి ఆలోచనల మేరకే కందుకూరులో పాలన ఉంటుందని చెప్పారు. మహీధర్ రెడ్డి ప్రజా సేవలోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీ ఇచ్చారు.
Vijayasai Reddy
Jagan
Maheedhar Reddy
YSRCP

More Telugu News