Saina Nehwal: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం

Saina Nehwal lashes out at Congress leader sexist jibe
  • అమ్మాయిలు పోరాడగలరని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదన్న సైనా నెహ్వాల్
  • నేను భారత్ తరఫున పోరాడినప్పుడు... పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ ఏం ఆలోచించిందని ప్రశ్న
  • ఓ వైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతుంటే... మరోవైపు స్త్రీద్వేషుల నుంచి అవమానం జరుగుతోందని వ్యాఖ్య
ఓ బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్థి కిచెన్‌కే పరిమితం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నేతపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని దావణగెరే లోక్ సభ బీజేపీ అభ్యర్థి గాయత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గాయత్రికి మాట్లాడటం సరిగా రాదని, కేవలం ఆమెకు కిచెన్‌లో వంట ఎలా చేయాలో మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళలు వంట గదికే పరిమితమవ్వాలట... కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చెబుతున్నారు... అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదని విమర్శించారు. తాను మైదానంలో భారత్ తరఫున ఆడినప్పుడు... పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించింది? అని ప్రశ్నించారు. నేను ఎలా ఉంటే బాగుండేది? అని చురక అంటించారు. ఓ వైపు నారీ శక్తికి వందనం అంటుంటే... ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం చెబుతుంటే... మరోవైపు స్త్రీద్వేషుల నుంచి మహిళలకు అవమానం జరుగుతోందన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన అంశమని పేర్కొన్నారు.
Saina Nehwal
BJP
Congress
Lok Sabha Polls

More Telugu News